ట్రంప్: అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన, బయటపెట్టిన తాజా సర్వే

భారత్ భవిష్యత్తు గురించి భారతీయ అమెరికన్లు ఆశాభావంతో ఉన్నారు. కానీ, డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత రెండు దేశాల సంబంధాలపై ఆందోళన చెందుతున్నారని తాజా సర్వేలో తేలింది.
భారత్ – అమెరికా రాజకీయ సంబంధాలు, వైఖరిపై 2024 అక్టోబర్లో కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ యూ గవర్నెన్స్ సంస్థ ఒక సర్వే నిర్వహించింది.
2024లో భారత్, అమెరికాలో ఎన్నికలు జరిగాయి.
ఈ రెండు దేశాల మధ్య బలమైన బంధం ఉన్నా, అప్పుడప్పుడు అది కాస్త ఒత్తిడి ఎదుర్కొంటోంది.
భారతీయ సంపన్నుడు గౌతం అదానీపై అమెరికా దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయడం, అమెరికా గడ్డపై హత్యకు దిల్లీ నుంచి కుట్ర చేశారనే ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తత ఏర్పడింది.
అమెరికాలో 50 లక్షల మందికి పైగా భారతీయులు ఉన్నారు.
ఈ సర్వేలో భాగంగా భారతీయ అమెరికన్లను కొన్ని కీలక ప్రశ్నలు అడిగారు.
మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పాలనా కాలంలో అమెరికా- భారత్ సంబంధాలు ఎలా ఉన్నాయని భారతీయ అమెరికన్లు భావిస్తున్నారు? డోనల్డ్ ట్రంప్ మంచి ప్రత్యామ్నాయమని మీరు భావిస్తున్నారా? 2024 ఎన్నికల తర్వాత భారతదేశపు గమనాన్ని ఎలా చూస్తున్నారు?
ఈ ప్రశ్నల గురించి అమెరికా వ్యాప్తంగా ఉన్న 1206 మంది భారతీయ అమెరికన్ల అభిప్రాయాలను సేకరించారు. అందులో కొన్ని కీలక అంశాలు ఇలా ఉన్నాయి.