ట్రంప్ ప్రకటనతో ఆవిరవుతున్న ఆసియన్ల సంపద.. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ పతనం
Trump Modi Meeting
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ పతనం చూశాయి.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ భారతదేశం సహా ప్రపంచంలోని చాలా దేశాలపై దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2న పెంచారు.
దీంతో ఆసియా , అమెరికా స్టాక్ మార్కెట్లు పతనమవుతున్నాయి.
సోమవారం జపాన్, హాంకాంగ్, భారత్, సింగపుర్ సహా చాలా దేశాలు స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలను చూశాయి.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ మార్కెట్ల పతనంపై స్పందిస్తూ “ఏదీ పతనమవకూడదని కోరుకుంటున్నాను, కానీ కొన్నిసార్లు విషయాలను సరిదిద్దడానికి మెడిసిన్స్ తీసుకోవాలి” అన్నారు.
సోమవారం ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన వెంటనే భారీ పతనం నమోదైంది.
భారత్‌లో మార్కెట్లు ఏ మేరకు పతనమయ్యాయి.. కొన్ని ఇతర మార్కెట్లు ఎలా కుదేలయ్యాయో చూద్దాం..

ఆసియాలో మార్కెట్ ఎంత పడిపోయింది?
డోనల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్స్ ప్రకటన ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌లో కూడా కనిపించింది.
సోమవారం ఉదయం నిఫ్టీ 4 శాతం కంటే ఎక్కువ తగ్గుదలను చూసి, మార్కెట్ ముగిసే సమయానికి 3.24 శాతం నష్టపోయింది.
మరోవైపు సెన్సెక్స్ 2,226 పాయింట్లు నష్టపోయి 73,137.90 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక, ఏఎఫ్‌పీ ప్రకారం.. హాంకాంగ్ హాంగ్ సెంగ్‌కు గత 28 ఏళ్లలో ఇదే భారీ పతనం.
ఇతర ఆసియా దేశాలలోనూ స్టాక్ మార్కెట్ పరిస్థితి అలాగే ఉంది.
అమెరికా డో జోన్స్ ఫ్యూచర్స్ 2 శాతం పడిపోయాయి
- జపాన్ నిక్కీ 6.3 శాతం పడిపోయింది
- హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 13.22 శాతం పడిపోయింది
- చైనా షాంఘై కాంపోజిట్ 6.6 శాతం పడిపోయింది
- ఆస్ట్రేలియా ఏఎస్ఎక్స్200.. 4.5 శాతం పడిపోయింది
- దక్షిణ కొరియా కోస్పి 4.4 శాతం పడిపోయింది
- తైవాన్ టైక్స్ 9.7 శాతం పతనమైంది.
- సింగపూర్ ఎస్టీఐ 7.1 శాతం పడిపోయింది
Read Also

డోనల్డ్ ట్రంప్ ఏమన్నారు?
స్టాక్ మార్కెట్ గురించి అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌ను అడిగినప్పుడు “మార్కెట్‌లో ఏం జరుగుతుందో మీకు చెప్పలేను. కానీ అమెరికా బలంగా ఉంది” అన్నారు.
“ఎలాంటి పతనాన్నీ నేను కోరుకోవడం లేదు, కానీ కొన్నిసార్లు పరిస్థితిని చక్కదిద్దడానికి మెడిసిన్స్ తీసుకోవలసి ఉంటుంది” అని ట్రంప్ అన్నారు.
సుంకాలు విధించిన తర్వాత ఉద్యోగాలు, పెట్టుబడులు అమెరికాకు తిరిగి వస్తున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. ప్రపంచం త్వరలో అమెరికాను చెడుగా చూడటం మానేస్తుందని ఆయన తెలిపారు.
సుంకాల విధింపును ట్రంప్ సమర్థించుకున్నారు. ఏ ఒప్పందమైనా తాత్కాలికమేనన్నారు.
“నేను చాలామంది యూరోపియన్, ఆసియా నాయకులతో మాట్లాడాను. వారు రాజీకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు” అని ట్రంప్ అన్నారు.





