లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ స్టర్ గా ఎలా మారాడు.. సల్మాన్ ఖాన్ తో వైరం ఏంటి?
“మమ్మల్ని జోకర్స్ అనుకుంటున్నారా! రాసిపెట్టుకోండి.. సల్మాన్‌ను ఖాన్‌ను నెత్తుటి మడుగులో ముంచేసే రోజు దగ్గర్లోనే ఉంది.. జోద్‌పూర్‌లోనే సల్మాన్ ఖాన్ ని చంపేస్తాం.. మేమంటే ఏంటో ఆరోజు తెలుస్తుంది..” ఈ డెడ్లీ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా.. లారెన్స్ బిష్ణోయ్! ఓ దారి దోపిడీ కేసులో జోద్ పూర్ కోర్టుకు హాజరైనప్పుడు పబ్లిక్ లో, కోర్టు హాల్ సాక్షిగా, సల్మాన్ ఖాన్ కు ఈ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చాడు. అప్పటికి లారెన్స్ బిష్ణోయ్ వయసు కేవలం 24 సంవత్సరాలు! దీంతో పబ్లిసిటీ స్టంట్ కోసమే ఈ కుర్రాడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అందరూ లైట్ తీసుకున్నారు.
కట్ చేస్తే.. 2022లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పాప్ సింగర్ సిద్ధూ మూసేవాలాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పట్టపగలే, వందలాది మంది చూస్తుండగా అతి కిరాతకంగా కాల్చి చంపింది. ఈ దారుణ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన కొద్ది రోజులకే.. మా నెక్ట్స్ టార్గెట్ నువ్వేనంటూ సల్మాన్ ఖాన్‌కు 28 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్ మరోసారి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడు. కానీ, ఈసారి వచ్చిన వార్నింగ్ ను సల్మాన్ ఖాన్ సీరియస్ గా తీసుకున్నాడు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ సాయంతో భారీ భద్రత ఏర్పాటు చేసుకున్నాడు.
2024 ఏప్రిల్ లో.. ముంబై మహా నగరంలో సల్మాన్ ఖాన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉన్నప్పటికీ.. లారెన్స్ బిష్ణోయ్ పక్కాగా స్పాట్ పెట్టేశారు. అర్ధరాత్రి వేళ సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పులకు తెగబడ్డారు. ఈసారి సల్మాన్ ఖాన్ తప్పించుకున్నప్పటికీ.. భయంతో వణికిపోయాడు. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే స్వయంగా సల్మాన్ ఖాన్ ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పారంటే.. పరిస్థితిని అర్థం చేసుకోండి!
సరిగ్గా 6 నెలల తర్వాత 2024 అక్టోబర్ 12వ తేదీ.. సల్మాన్ ఖాన్ కు అత్యంత సన్నిహితుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ బాబా సిద్ధిఖీని అత్యంత దారుణంగా కాల్చి చంపారు. సిద్ధిఖీని చంపింది మేమేనంటూ బిష్ణోయ్ గ్యాంగ్ పబ్లిక్ గా ప్రకటించింది. సల్మాన్ ఖాన్‌కు ఎవరు సహాయం చేస్తే.. వాళ్ల ఖాతాలను సరి చేస్తామంటూ డెడ్లీ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగిపోతోంది.
లారెన్స్ బిష్ణోయ్ ఇన్ని ఘోరాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని అనుకుంటున్నారా? అయితే.. ఈ విషయం తెలిస్తే మీరు ముక్కున వేలేసుకోవడం ఖాయం! లారెన్స్ బిష్ణోయ్ గత నాలుగైదేళ్లుగా జైల్లోనే ఉన్నాడు.. ఆ జైలు నుంచే తన నేర సామ్రాజ్యాన్ని నడుపుతున్నాడు.
లారెన్స్ బిష్ణోయ్ ప్యూర్ వెజిటేరియన్, మాంసాహారం ముట్టుకోడు.. కానీ, మనుషుల్ని ఇంత క్రూరంగా ఎందుకు చంపుతున్నాడు? బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై ఎందుకు ఈ రేంజ్ లో పగతో రగిలిపోతున్నాడు.. లారెన్స్ పేరు చెప్తే.. ఉత్తరాది రాష్ట్రాలు ఎందుకు వణికిపోతున్నాయి.. 700 మంది గ్యాంగ్ ను రిక్రూట్ చేసుకొని దేశాన్ని ఏం చెయ్యాలని అనుకుంటున్నాడు.. 31 ఏళ్ల యవసులోనే ఇంత కరుడుగట్టిన నేరగాడిలా ఎలా మారాడు అనే పచ్చి నిజాలు తెలుసుకోవాలంటే.. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరికి వరకు చూడండి! అలాగే, మన ఛానల్ ని సబ్ స్కైబ్ చేసుకోని.. ఈ సమాచారాన్ని నలుగురికి షేర్ చేయండి.
పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పుర్ జిల్లా ధత్తరన్‌వాలీ గ్రామంలోని ఓ సంపన్న కుటుంబంలో లారెన్స్ బిష్ణోయ్ జన్మించాడు. లారెన్స్.. బిష్ణోయ్ వర్గానికి చెందిన వ్యక్తి. బిష్ణోయ్ వర్గం అంటే.. ఎడారి ప్రాంతంలో వన్య ప్రాణులనూ, చెట్లను కాపాడడానికి నడుం బిగించిన జన సముదాయం. ఈ వర్గానికి చెందిన వారు అటవీ జంతువులను, చెట్లను కాపాడడం కోసం తమ ప్రాణాలివ్వడానికైనా వెనుకాడరు. జింక పిల్ల తల్లి మరణిస్తే.. ఆ పిల్లను బిష్ణోయీ మహిళ తన చాతి దగ్గరకు తీసుకుని పాలు ఇస్తుంది. కృష్ణ జింక అంటే.. వారికి దేవతతో సమానం. అలాంటి కృష్ణ జింకను సల్మాన్ ఖాన్ చంపాడని ప్రపంచానికి తెలిసినప్పుడు లారెన్స్ బిష్ణోయ్ వయసు కేవలం ఐదేళ్లు! కానీ, ఆ వయసు నుంచే సల్మాన్ ఖాన్ పై లారెన్స్ పగతో రగిలిపోతున్నాడు.
పోలీసు రికార్డుల ప్రకారం లారెన్స్ బిష్ణోయ్ అసలు పేరు సత్వీందర్ సింగ్.
అయితే చిన్నప్పుడు సత్వీందర్ సింగ్‌ను లారెన్స్ అనే ముద్దుపేరుతో పిలుచుకునేవారు.
కాలక్రమేనా అదే ఆయన పేరుగా మారిపోయింది. లారెన్స్ తండ్రి లవీందర్ సింగ్ మొదట హర్యానాలో కానిస్టేబుల్‌గా పనిచేసేవారు.
1992లో ఉద్యోగంలో చేరిన లవీందర్ సింగ్.. లారెన్స్ పుట్టిన తర్వాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు.
పంజాబ్‌లోని అబోహర్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన లారెన్స్.. పైచదువుల కోసం 2010లో చండీగఢ్ వెళ్లాడు.
2011లో చండీగఢ్ డీఏవీ కాలేజీలో డిగ్రీ చేరారు. తర్వాత న్యాయ విద్య అంటే “లా” కూడా చదివాడు.
లారెన్స్ బిష్ణోయ్ జాతీయ స్థాయి అథ్లెట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత విద్యార్థి రాజకీయాల్లోకి కూడా ప్రవేశించారు. ఇక్కడే లారెన్స్‌కు గోల్డీ బ్రార్ అనే వ్యక్తితో స్నేహం కుదిరింది.
అక్కడి నుంచి లారెన్స్ బిష్ణోయ్ జీవితం కొత్త మలుపు తిరిగింది.
గోల్డీ బ్రార్ తో కలిసి మెల్లగా అసాంఘిక కార్యకలాపాలు మొదలుపెట్టాడు. విద్యార్థి రాజకీయాలు దీనికి ముసుగుగా మారాయి.
2011-2012లో పంజాబ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించిన లారెన్స్ తర్వాత దానికి నాయకుడయ్యారు.
ఈ సమయంలోనే మొదటి సారి లారెన్స్ పై తొలి కేసు నమోదైంది.
విద్యార్థి ఎన్నికల్లో ఓటమిపై కలత చెందిన లారెన్స్ సహచరుల్లో ఒకరు.. ప్రత్యర్థి వర్గానికి చెందిన విద్యార్థి నాయకుడిపై కాల్పులకు తెగబడ్డాడు.
ఆ కేసులో తొలిసారి లారెన్స్ పేరును పోలీసులు హత్యాయత్నం కేసులో ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.
2013లో లూథియానా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ముక్తార్ అనే రాజకీయ నాయకుడిని లారెన్స్ బిష్ణోయ్ హత్య చేశారు.
2014లో ఏకంగా రాజస్థాన్ పోలీసులపైనే కాల్పులు జరిపాడు.
ఈ క్రమంలోనే 2014లో తొలిసారి రాజస్థాన్‌లో అరెస్టు చేసి భరత్‌పూర్ జైలుకు తరలించారు.
విచారణ కోసం పంజాబ్‌లోని మొహాలీకి తీసుకెళ్తుండగా ఆయన తప్పించుకున్నాడు.
2016లో లారెన్స్ మళ్లీ అరెస్టయ్యాడు.
ఈ సమయంలోనే సల్మాన్ ఖాన్ ను చంపేస్తానంటూ బహిరంగంగా ప్రకటించాడు. ఎందుకంటే..
1998 సెప్టెంబర్ 26న ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ సమీపాన కంకనీ అనే గ్రామం వద్ద కృష్ణ జింకను వేటాడి చంపాడని సల్మాన్ ఖాన్ పై బిష్ణోయ్ వర్గానికి చెందిన కొందరు కేసు పెట్టారు.
ఈ కేసులో సల్మాన్ తొలిసారిగా 1998 అక్టోబర్‌లో అరెస్టయ్యారు. అప్పుడు వెంటనే ఆయనకు బెయిల్ మంజూరైంది.
ఈ కేసు విచారణ న్యాయస్థానంలో సుదీర్ఘంగా కొనసాగింది.
ఈ క్రమంలో 2018 ఏప్రిల్ 5న జోధ్‌పూర్ కోర్టు సల్మాన్ ఖాన్ ను దోషిగా ప్రకటించింది. ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 10 వేల రూపాయిలు జరిమానా విధించింది.
దీంతో సల్మాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని, జోధ్‌పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు. 2 రోజుల తర్వాత సల్మాన్ బెయిల్ పై బయటికి వచ్చాడు.
ఆ సమయంలోనే.. జోద్‌పూర్‌లోనే సల్మాన్ ఖాన్ ని చంపేస్తామని.. కోర్టు హాల్ సాక్షిగా లారెన్స్ బిష్ణోయ్ వార్నింగ్ ఇచ్చాడు.
ఆ తర్వాత భద్రతాకారణాల రీత్యా 2021లో లారెన్స్ బిష్ణోయ్ ని తీహార్ జైలుకు తరలించారు.
అప్పటి నుంచి జైలు నుంచే నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు.
లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్, అనుచరుడు గోల్డీ బ్రార్‌లు కెనడాలో ఉంటూ ఈ గ్యాంగ్ కార్యకలాపాలు నడిపిస్తున్నారు.
2020లో భుల్లర్ అనే మాఫియా డాన్‌ను కాల్చిచంపారు.
2021 సెప్టెంబర్‌లో కెనడాలో గ్యాంగ్ స్టర్ సుఖ్ దోల్ సింగ్ అలియాస్ సుఖను దారుణంగా చంపేశారు.
2022లో ప్రముఖ పంజాబీ పాప్ సింగర్ సిద్ధూ మూసేవాలాను దారుణంగా హత్య చేశారు.
2023 డిసెంబర్‌లో జోధ్‌పూర్ లో రాష్ట్రీయ రాజ్ పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్ దేవ్ సింగ్ గోమేధీని కాల్చి చంపారు.
ఈ హత్య చేస్తోంది తానేనని గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ ప్రకటించినప్పటికి.. జైల్లో ఉండి స్కెచ్ వేసింది మాత్రం లారెన్స్ బిష్ణోయ్ అని తెలుస్తోంది.
ఇక, సిద్ధూ మూసేవాలా హత్య జరిగిన కొద్ది రోజులకే సల్మాన్ ఖాన్‌కు లేపేస్తామని లారెన్స్ బిష్ణోయ్ బెదిరింపులకు దిగాడు.
ఈ క్రమంలోనే, 2022లో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో లారెన్స్ పేరును చేర్చారు.
అనంతరం గుజరాత్ పోలీసులు 2023 ఆగస్టు 23న లారెన్స్‌ను ఢిల్లీ జైలు నుంచి గుజరాత్‌లోని సబర్మతి జైలుకు తరలించారు.
అప్పటి నుంచి ఆయన సబర్మతి జైలులోనే ఉన్నాడు.
కానీ, జైలు నుంచే లారెన్స్ బిష్ణోయ్.. ఓ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడంటే, అతడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోండి..
ఈ ఇంటర్వ్యూలోనే సల్మాన్ ఖాన్ కు లారెన్స్ ఓ బంపరాఫర్ ఇచ్చాడు.
సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను చంపి బిష్ణోయ్ సమాజాన్ని అమమానించాడని, అందుకు క్షమాపణలు చెప్పాలని లారెన్స్ డిమాండ్ చేశాడు. లేకపోతే సల్మాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాడు. “సల్మాన్ ఖాన్ పై మా బిష్ణోయ్ సమాజంలో తీవ్ర ఆగ్రహం ఉంది. ఆమన మమ్మల్ని అవమానించాడు. అతనిపై ఓ కేసు కూడా ఉంది. కానీ ఇంతవరకు క్షమాపణలు చెప్పలేదు. ఇప్పటికైనా సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. సల్మాన్‌పై నాకు చిన్నప్పటి నుంచే కోపం ఉంది. నాకు ఎవరి సాయం అక్కర్లేదు.. సల్మాన్ అహాన్ని అతి త్వరలో దెబ్బతీస్తా. ఆయన మా పవిత్ర దేవాలయానికి వచ్చి క్షమాపణలు చెప్పాలి. అప్పుడు మా సమాజం ఆయన్ను క్షమిస్తే.. ఇకపై నేను సల్మాన్ ఖాన్ జోలికి వెళ్లను” అని లారెన్స్ బిష్ణోయ్ ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. సల్మాన్‌ను తొలిసారి బెదిరించినప్పుడు ఆయన భారీగా డబ్బు కూడా ఆఫర్ చేశాడని, కానీ తాము తిరస్కరించినట్లు వెల్లడించాడు. సల్మాన్‌ను చంపేందుకు 4 లక్షల రూపాయిలు పెట్టి తుపాకీ కూడా కొన్నానని.. బిష్ణోయ్ సమాజానికి సల్మాన్ క్షమాపణలు చెప్పకపోతే.. ఆ తుపాకీకి పని చెప్తానని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు.
అయితే.. సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పకపోవడంతో ఆయన సన్నిహితులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సల్మాన్ సన్నిహితుడు, ఎమ్మెల్సీ సిద్ధిఖీని అతి కిరాతకంగా కాల్చి చంపారు.
లారెన్స్ బిష్ణోయ్ కొన్నేళ్లుగా జైల్లో ఉన్నా.. గ్యాంగ్ ని ఎలా నడుపుతున్నాడంటే.. బ్యారక్‌ల్లో అక్రమంగా వచ్చే సెల్‌ఫోన్ల ద్వారా అనుచరులతో నిరంతరం టచ్‌లో ఉంటాడని పేరుంది. సమాజంలో పెద్ద పేరు గలిగిన వారిని లక్ష్యంగా చేసుకొని హత్యలు చేస్తే తమ గ్యాంగ్ పేరు బాగా ప్రచారమవుతుందని లారెన్స్ ప్లాన్! దీంతో పాటు ప్రత్యర్థి గ్యాంగ్‌లకు వార్నింగ్ ఇవ్వడానికి కూడా హత్యలకు పాల్పడుతుంటుంది. సిద్ధూ మూసేవాలా, బాబా సిద్ధిఖీ హత్యలు ఈ కోవలోకే వస్తాయి. దీంతో ఉత్తర భారత దేశంలోనే అత్యంత భయానక గ్యాంగ్‌గా లారెన్స్ బిష్ణోయ్ గ్రూపు పేరు తెచ్చుకొంది. వీటితో పాటు సంపన్న వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల నుంచి కూడా భారీగా సొమ్ములు వసూలు చేస్తాడని పేరుంది. ఢిల్లీలోని అఫ్గాన్ జాతీయుడు నాదిర్ షా నుంచి లారెన్స్ బిష్ణోయ్ భారీగా డబ్బులు డిమాండ్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది.
తాజాగా, సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేయడం ద్వారా ముంబైలో ఖాళీగా ఉన్న మాఫియా రాజ్యాన్ని ఆక్రమించడానికి లారెన్స్ బిష్ణోయ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ముంబై చీకటి సామ్రాజ్యాన్ని లీడ్ చేసిన దావూద్ ఇబ్రహీంకి చెందిన డీ-కంపెనీ ఇప్పుడు దాదాపు కనుమరుగైంది. దీంతో ఇప్పటి వరకు గ్యాంగ్ స్టర్ గా ఉన్న లారెన్స్ బిష్ణోయ్.. మహారాష్ట్రలో పట్టు సాధించి డాన్ గా ఎదగాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ పై హత్యాయత్నం, అధికార ఎమ్మెల్సీ సిద్ధిఖీని హత్య ఈ కోవలోకి వస్తాయి.
ప్రస్తుతం బిష్ణోయ్ గ్యాంగ్‌లో దాదాపు 700 మంది సభ్యులు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కెనడా నుంచి గోల్డీ బ్రార్ దీన్ని నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సాధారణంగా నేరం చేసిన తర్వాత నేరస్థులు పోలీసులకు దొరక్కుండా, చట్టానికి చిక్కకుండా తప్పించుకుంటారు. కానీ లారెన్స్ బిష్ణోయ్, ఆయన గ్యాంగ్ మాత్రం.. నేరాలు చేయడమే కాకుండా, ఆ నేరాలకు తమదే బాధ్యత అని ప్రకటించుకుంటున్నారు. ఇలాంటి పనుల వల్ల ముంబై అండర్ వరల్డ్ పై పట్టుసాధించడానికి ఇలా బరితెగించాడని స్పష్టంగా అర్థమవుతుంది.
చిన్న చిన్న నేరాలతో నెట్‌వర్క్‌ను విస్తరించిన దావూద్ ఇబ్రహీం లాగే లారెన్స్ బిష్ణోయ్ కూడా ఉగ్రవాద సిండికేట్‌గా పనిచేస్తున్నట్లు ఎన్‌ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. డ్రగ్స్ అక్రమ రవాణా, టార్గెట్ కిల్లింగ్స్, దోపిడీ రాకెట్ల ద్వారా దావూద్ ఇబ్రహీం తన నెట్‌వర్క్‌ను విస్తరించి.. ఆ తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి డీ-కంపెనీని ఏర్పాటు చేశాడు. ఇక అదే రకంగా చిన్న చిన్న నేరాలతో మొదలైన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్.. ప్రస్తుతం ఉత్తర భారతదేశాన్ని శాసిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ క్రమంలోనే ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో ఎన్నో క్రైమ్ సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ సైతం లారెన్స్ బిష్ణోయ్ నెట్వర్క్ ని చూసి ఆశ్చర్యపోయాడు.. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశాడు.
“1998లో ఆ జింకను సల్మాన్ ఖాన్ చంపినప్పుడు లారెన్స్ బిష్ణోయ్ కేవలం ఐదేళ్ల వయసున్న పిల్లాడు. కానీ, సల్మాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాడు. సల్మాన్ ఖాన్ ను చంపాలనుకుంటున్నాడు. ఇది ఆ జంతువుపై ఉన్న విపరీతమైన ప్రేమా లేక దేవుడు ఆడుతున్న వింత నాటకమా!” అంటూ ఆర్జీవీ అనుమానం వ్యక్తం చేశాడు.
అలాగే, “గ్యాంగ్‌స్టర్ గా మారిన ఓ లాయర్ ఓ జింకను చంపిన నేరానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఓ సూపర్ స్టార్ ను హత్య చేయాలని చూస్తున్నాడు. దీనికోసం తాను ఫేస్ బుక్ ద్వారా రిక్రూట్ చేసుకున్న 700 మంది తన గ్యాంగ్ కు ఆర్డర్లు ఇస్తున్నాడు. అంతకుముందు అదే స్టార్ కు సన్నిహితుడైన ఓ రాజకీయ నాయకుడిని కూడా చంపాలని అనుకున్నాడు. పోలీసులు అతన్ని పట్టుకోలేరు. ఎందుకంటే అతడు ప్రభుత్వ రక్షణలో ఓ జైల్లో ఉన్నాడు. అతని అధికారి ప్రతినిధి విదేశాల నుంచి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇదే స్టోరీని ఎవరైనా బాలీవుడ్ రైటర్ రాసి ఉంటే.. నమ్మశక్యం కాని, ఇలాంటి హాస్యాస్పద స్టోరీ రాసినందుకు అతన్ని కొట్టేవారేమో” అని ఆర్జీవీ మరో ట్వీట్ లో అన్నాడు.
అంటే.. లారెన్స్ బిష్ణోయ్ చాలా తెలివిగా క్రైమ్ చేస్తున్నాడని.. అతడు ప్రస్తుతం జైల్లోనే ఉన్నందు వల్ల బయట జరుగుతున్న నేరాలకు అతడిని బాధ్యుడిని చేయడం కష్టమని ఆర్జీవీ చెప్తున్నాడు.
31 ఏళ్ల లారెన్స్ ప్రస్తుతం సబర్మతి జైల్లో ఉన్నా, తన గ్యాంగ్‌ను నిరాటంకంగా నిర్వహిస్తున్నాడు. కటకటాల వెనక నుంచే తన ముఠాను ఆపరేట్ చేస్తున్నాడు. పొలిటీషియన్లనే కాదు.. బాలీవుడ్‌ను సైతం ఒంటిచేత్తో వణికిస్తున్నాడు. గతంలో దావూద్ ఇబ్రహీంను నిర్లక్ష్యం చేయడంతో అంతర్జాతీయ ఉగ్రవాదిగా మారాడు. ఇప్పుడు లారెన్స్ బిష్ణోయ్‌ను పట్టుకొని.. జైల్లో పెట్టినా.. బ్యారక్‌లో నుంచే నేర సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నాడన్న వార్తలు వస్తున్నాయి. అతడి గ్యాంగ్‌కు పక్కా స్కెచ్‌తో మెసేజ్‌లు చేరుతున్నాయి. జైల్లో ఉండి కూడా.. ఒక మాజీ మంత్రిని, పంజాబ్ పాపులర్ పాప్ సింగర్ ని హత్య చేయించగలిగాడంటే.. చిన్న విషయం కాదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
అలాగే, ఎన్‌ఐఏ దర్యాప్తు సమయంలో తన హిట్ లిస్ట్‌లో ఎవరున్నారో లారెన్స్ వెల్లడించారు. దాని ప్రకారం బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత బిగ్ బాస్ 17 విజేత మునావర్ ఫారూఖీ, గాయకుడు సిధూ మూసే వాలా మేనేజర్ షగన్‌ప్రీత్ సింగ్, బాబా సిద్ధిఖీ కుమారుడు జీషాన్ సిద్ధిఖీ, గ్యాంగ్‌స్టర్ కౌశల్ చౌదరి ఈ హిట్ లిస్ట్ లో ఉన్నారు.
మన దేశంలో అత్యంత ప్రమాదకర వ్యక్తిగా మారుతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ని అదుపు చెయ్యాలంటే, ఏం చెయ్యాలి… ఈ క్రూరమైన గ్యాంగ్ నుంచి తప్పించుకోవాలంటే బిష్ణోయ్ వర్గానికి సల్మాన్ ఖాన్ క్షమాపణలు చెప్పాల్సిందేనా.. 31 ఏళ్ల లారెన్స్ బిష్ణోయ్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.




